సుమతీ శతకం (Sumathi Shathakam) - 36
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దా బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం:-
కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో అలాగే రావాల్సిన వేళ సంపదలు వాటంతటవే వచ్చేస్తాయి. అదే విధంగా ఐశ్వర్యం పోవాల్సినరోజే కనుక వస్తే, ఏనుగు వెలగపండులోని గుజ్జును మాత్రమే ఎలాగైతే గ్రహించి వదిలేస్తుందో అలాగే సిరి చల్లగా వెళ్లిపోతుంది. కనుక, ఐశ్వర్యం పట్ల అనవసరమైన ఆశలు, భ్రమలు పెట్టుకోరాదు.

No comments:
Post a Comment