Thursday, August 1, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 10

కృష్ణ శతకం (Krishna Shathakam) - 10

త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్
కపటపు రాజవు భళిరే
కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!


ప్రతిపదార్థం:-
కృపగల అంటే దయాగుణం వలన; బౌద్ధావతారం అంటే బుద్ధమూర్తివైనవాడా; ఘనుడవు అంటే గొప్పవాడివి; కృష్ణా అంటే ఓ కృష్ణా; త్రిపుర + అసుర అంటే త్రిపుర రాక్షసుల యొక్క; భార్యలను అంటే సతులను; నిపుణతతో అంటే చాకచక్యంగా; వ్రతము చేత అంటే నియమానుసారం వ్రతం ఆచరించటం చేత; కీర్తుల్ అంటే పేరుప్రఖ్యాతులను; నిలిపిన అంటే నిలబెట్టిన; కపటపు అంటే కపటమైన; రాజువు అంటే పాలకుడివి అయితివి; భళిరే అంటే నిన్ను మెచ్చుకోవచ్చును.

భావం:-
ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి.

No comments:

Post a Comment