Sunday, August 4, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 9

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 9

రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో
ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:-
దయకు సముద్రం వంటివాడవైనవాడు దశరథరాముడు. అందరినీ సంతోషపెట్టేవాడు. చేసిన పాపాలను తొలగించేవాడు. కల్పవృక్షపు తీగలే తోటగా కలిగి, శుభప్రదమైన లక్షణాలను ప్రసాదించేవాడు. జననమరణాల వంటి ఆరు వికారాలను జయించేవాడు. మంచివారిని రక్షించడమే దీక్షగా కలవాడు. దయ అనే గుణం కలిగినవాడు. ఇన్ని లక్షణాలతో ప్రకాశిస్తున్న భద్రాద్రిరామా! నీ పాదాలను కొలుచుకుంటాను.


ప్రతిపదార్థం:-
రాముడు అంటే ఆనందం కలిగించేవాడు; ఘోర అంటే భయంకరమైన; పాతక అంటే పాపాలను; విరాముడు అంటే పోగొట్టేవాడు; సత్ + గుణ అంటే మంచిగుణాలు అనెడి; కల్పవల్లికా అంటే కల్పవృక్షపుతీగయే; ఆరాముడు అంటే తోట అయినవాడు; షట్ + వికార అంటే జననమరణాలు మొదలైన ఆరు వికారాలను; జయ అంటే తెలియచేయడం చేత; రాముడు అంటే మనసు తెలిసినవాడు; సాధుజన అంటే మంచివారిని; ఆవన అంటే రక్షించటం అనే; వ్రత అంటే నియమం చేత; ఉద్దాముడు అంటే గొప్పవాడైన; శ్రీరాముడే అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడే; మాకు అంటే మా అందరికీ; పరమ దైవము అంటే ప్రధానమైన దేవుడు అని; మీ అంటే మీ యొక్క; అడుగు అంటే పాదాలు అనెడి; కెంపు + తామరలను అంటే ఎర్రతామరలను; ఏను అంటే నేను; భజించెదను అంటే పూజిస్తాను; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా; కరుణ అంటే దయకు; పయోనిధీ అంటే సముద్రుని వంటివాడా!

No comments:

Post a Comment