Saturday, August 31, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 28

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 28

కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ
యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ!


తాత్పర్యం:-
నాకు చేతులున్నవి నీకు మొక్కడానికే. నా కళ్లు నీ తేజస్సును చూడడానికే ఉన్నాయి. నా నాలుక నీ నామాన్ని కీర్తించడానికే ఉన్నది. నా రెండు చెవులూ నీ మధురగాథలను వినడానికి మాత్రమే ఉన్నై. అంతేకాదు, నాకు నాసిక ఉన్నది ఎందుకంటే, నీ సేవకు వచ్చిన పూల సువాసనను పీల్చడానికే! ఈ పంచేంద్రియాలన్నీ నీ సేవకే కానీ, మరి దేనికో కాదు సుమా.

No comments:

Post a Comment