వేమన శతకం (Vemana Shatakam) - 103
అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కువ లేదయా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం:
అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు.

No comments:
Post a Comment