Monday, August 26, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 18

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 18

చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు
స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:-
సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు.

No comments:

Post a Comment