దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 17
కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం
బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా
సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!
భావం:-
దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని... బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా.

No comments:
Post a Comment