Friday, August 23, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 15

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 15

బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్
జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్
గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా
తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:-
దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడే అసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు).

No comments:

Post a Comment