Thursday, August 8, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 10

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 10

కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ
యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ


భావం:-
దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు.

No comments:

Post a Comment