Wednesday, September 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 349

వేమన శతకం (Vemana Shatakam) - 349

దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి
మోహమందు దనివి మోసపోడు
ఇంద్రజాలకుం డటెందునకు జిక్కండు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గారడివాడు ఇతరులను మోసగించుతాడు కాని తన మాయలో తానెప్పుడు పడిపోడు. అలాగే దేహతత్వమేరిగిన యొగి మొహావేశాలలో చిక్కడు.

No comments:

Post a Comment