వేమన శతకం (Vemana Shatakam) - 320
మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు ముఱికి తోడ నుండెనేని
అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం:
మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం.

No comments:
Post a Comment