వేమన శతకం (Vemana Shatakam) - 142
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యము :
మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన)

No comments:
Post a Comment