Sunday, September 8, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 136

వేమన శతకం (Vemana Shatakam) - 136

గంగిగోవు పాలు గరిటెడైనను జాలు
కడవె డయిననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
స్వచ్చమైన ఆవుపాలు ఒక్కగరిటెడే చాలు.కడవతో ఉన్నా గాడిద పాలు ఏమి ఫలము? భక్తితో[ప్రేమతో] పెట్టే పట్టెడన్నం తృప్తినిస్తుంది. పంచబక్ష్య పరమాన్నాలు ప్రేమలేనిదే వృధా!వేమన.

No comments:

Post a Comment