Saturday, September 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 129

వేమన శతకం (Vemana Shatakam) - 129

నీళ్ళ లోన మొసలి నిగిడి ఏనుగు బట్టు
బైట కుక్కచేత భంగ పడును
స్థానబలిమి గాని తనబలము గాదయా
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
మనుజునకు స్థానము,కాలము,దైవముజయాపజయములు కలిగిస్తాయి.మొసలి నీటిలో నున్న యెడల బలమైన ఏనుగుని కూడా బాధించ గలదు.ఆదే మొసలినీళ్ళబైట ఉన్నప్పుడు కుక్కలు కరిచిచంపుతాయి.వేమన.

No comments:

Post a Comment