Monday, September 2, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 108

వేమన శతకం (Vemana Shatakam) - 108

చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ
కంటిలోనినలుసు కాలిముల్లు
యింటిలోనిపోరు ఇంతింతకాదయా
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
చెప్పులో దూరినరాయి,చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంటిలోఎవరైనా పెట్టేపోరు కొంచెమైనా ఎక్కువగా బాధిస్తాయి. ఆసమయంలో బుర్రకూడా పనిచెయ్యదు.

No comments:

Post a Comment