Sunday, September 1, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 105

వేమన శతకం (Vemana Shatakam) - 105

స్త్రీల సుఖము జూచి చిత్తంబు నిలుకడ
సేయని మనుజుండు చెడు నిజంబు
ఏటిగట్టు మ్రాని కెప్పుడు చలనంబు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ఏటిగట్టుమీద వృక్షం ఎప్పుడు చెలించి కూలుతుందో తెలియదు. అట్లే ఎల్లప్పుడూ స్త్రీ సుఖమును కాంక్షించేవాడు చెడిపోక తప్పదు.

No comments:

Post a Comment