Friday, September 6, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 56

సుమతీ శతకం (Sumathi Shathakam) - 56

కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠకంఠీ కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ


భావం:-
భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం

No comments:

Post a Comment