Friday, September 13, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 42

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 42

స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః,
యస్మాత్తపసోऽపి ఫలం స్వర్గః స్వర్గే2పి చాప్సరసః


భావం:-
దుర్విరక్తులు తాము తమనే
మోసం చేసుకుంటూ ఇతరుల్నీ
వంచించేవారిని గురించి చెబుతున్నాడు-

స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు-
అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు.
తపస్సే ముఖ్యం - అని కూడ వీరి భాషణ.
తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి.
అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు.
స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే
అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు
స్త్రీలను నిందించడం దేనికీ
దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ
బయటకు అలా అంటారే తప్ప
లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం

No comments:

Post a Comment