Saturday, September 7, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 20

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 20

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకుసాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే


భావం:-
విద్యఎవరికీకనపడని గుప్తఐశ్వర్యం. ధనాన్నిఎవరైనా దోచుకుంటారనేభయంతో దాచాలి.విద్యదాచ-పనిలేదు.విద్యాజ్ఞానమున్నవారు అవార్డులు,సత్కారాలు కోరకపోయినా కీర్తిప్రతిష్టలతో వెలుగుతూంటారు.వీరికి ధనలోపముండదు.విద్యే గురువుగాను విదేశాలలో బంధువుగాను ఉంటుంది.విద్యే దైవం.దానికిసరిపడే ధనముండదు.విద్యావంతులని రాజులు[దేశాద్యక్షులు]పూజిస్తారు.విద్యలేనివాడు మనిషా?అంటున్నాడు భర్తృహరి.

No comments:

Post a Comment