Saturday, September 7, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 62

కృష్ణ శతకం (Krishna Shathakam) - 62

కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచునన్ను బాయక ఎపుడున్
జంటయు నీవుండుట నే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా


భావం:-
కృష్ణా!నేను నీ బంటునని నీవు కంటికి రెప్పవలె నన్ను ఎల్లప్పుడూ వదలక కాపాడు చుండుటచే ఎంతో కష్టమైన పాపఫలములను ధైర్యముతో దాటగలిగితిని.కృష్ణ శతకము.

No comments:

Post a Comment