శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 126
నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్ వ్రాసి యి
మ్మాపాఠం బొనరింతునన్న యతడున్, మంజు ప్రబంధంబు ని
ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్ సద్బాంధవుల్ గాక, ఛీ
ఛీ! పృష్ఠాగల బాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
భక్తి ప్రపత్తులున్న వారే దైవ బాంధవులు. పుట్టుకతో వచ్చే బంధుత్వాల కన్నా భగవంతునిపట్ల విశ్వాసం గల వారందరిలోని భావ బంధుత్వం ఎంతో గొప్పది. దేవునిపై కావ్యాలు చెబుతూ, పద్యాలు రాస్తూ, మహిమలను వల్లిస్తూ ఉండేవారు, పని కట్టుకొని ప్రబంధాలను మనోహరంగా నియమనిష్ఠలతో పఠించేవారు అసలైన పరమాత్మ బంధువులు.

No comments:
Post a Comment