Saturday, September 7, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 65

కృష్ణ శతకం (Krishna Shathakam) - 65

గంగ మొదలైన నదులను
మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా


భావం:-
కృష్ణా!గంగమొదలైన నదులలో స్నానము చేసిన యెడల పుణ్యములు కలుగునని చెప్పుచుందురు.అయితే అవి మిమ్ములను తలచి ధ్యాన్నించేవారికి కలిగే ఫలితములతో సాటిరావు.[స్థాయికి]తీసికట్టే అనిఅర్ధం.

No comments:

Post a Comment