Friday, September 6, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 60

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 60

చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా
జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్
మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ
డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా


భావం:-
మదపుటేనుగు మావటివానిచేతిలో అణగియున్నట్లు ఎంతబలవంతుడైననూ విధివశమున అల్పునియొద్ద కష్టపడును.

No comments:

Post a Comment