Friday, August 30, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 92

వేమన శతకం (Vemana Shatakam) - 92

ఎరుకమాలువాడు ఏమేమిచదివిన
జదివినంతసేపు సద్గుణియగు
కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:-
తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది.

No comments:

Post a Comment