Tuesday, August 6, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 25

వేమన శతకం (Vemana Shatakam) - 25

టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతి చెడును
ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఉల్లితోటలో ఉన్న మల్లెమొక్క గుణము ఎలా నశించునో, అలానే ఉత్తముడైనవాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది. కాబట్టి చెడ్డ వారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరచుకోవాలి.

No comments:

Post a Comment