Saturday, August 31, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 42

సుమతీ శతకం (Sumathi Shathakam) - 42

తనకలిమి ఇంద్రభోగము
తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తనచావు జగత్ప్రళయము
తనువలచిన యదియెరంభ తథ్యము సుమతీ


భావం:-
తన భాగ్యమే ఇంద్రవైభవము వంటిదని, తనదరిద్రమే ప్రపంచమున కంతటికీ దరిద్రమనీ, తనచావు యుగాంత ప్రళయమని, తను ప్రేమించిన స్త్రీయే రంభ అని ప్రజలనుకొనుచుందురు.

No comments:

Post a Comment