Thursday, August 29, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 11

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 11

తెలియని  మనుజుని సుఖముగ
తెలుపందగు సుఖతరముగ  తెలుపగవచ్చున్
దెలిసిన  వానిం దెలిసియు
తెలియని నరుదేల్పబ్రహ్మదేవుని వశమే.


భావం :-
పూర్తిగా తెలియని వానికి సులభముగా  తెలుపవచ్చును.చక్కగా తెలిసిన వానికి తెలియజేయుట మరింత సులభము. కానీ  స్వల్పజ్ఞానము కలిగి అన్ని తెలుసునని గర్వపడు వానిని సృష్టికర్త బ్రహ్మ  కూడా రంజింపచేయలేడు.

No comments:

Post a Comment