Monday, August 26, 2019

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 7

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 7

చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త
న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో,
ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా
జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!


తాత్పర్యం:-
మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ!

No comments:

Post a Comment