Showing posts with label PothanaPadyaalu. Show all posts
Showing posts with label PothanaPadyaalu. Show all posts

Thursday, September 5, 2019

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 6

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 6

ఇందుగల డందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే!


భావం:-
'ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం.

Wednesday, September 4, 2019

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 5

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 5

ధనము వీథిబడిన దైవవశంబున
నుండు బోవు మూలనున్ననైన
నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు
రక్షితుండు మందిరమున జచ్చు


భావం:-
దేవునిదయవుంటే వీధిలోపడేసినా డబ్బుపోదు.లేకపోతే ఇంట్లోమూల జాగ్రత్తచేసినా పోతుంది.అడవిలో రక్షణ,బలములేకున్నా దైవబలంతో మనిషిబతుకుతాడు. లేకపోతే ఇంట్లోఉన్నాచస్తాడు.భాగవతం.పోతన.

Sunday, September 1, 2019

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 4

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 4

లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం
జీకటికవ్వల నెవ్వం
డేకాకృతివెలుగు నతనినే సేవింతున్


భావం:-
లోకములు,లోకపాలకులు,లోకములలో నివసించువారు,కడకు లోకములన్నియు నశించినపిమ్మట గాఢమైన అంధకారము నిండియున్నవేళ ఒకేఆకారముతో వెలుగుతున్న వానినేసేవింతును.[ఆరాధింతును]-గజేంద్రమోక్షం,పోతన

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 3

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 3

వినుదట జీవులమాటలు
చనుదట చనరానిచోట్ల శరణార్ధులకో
యనుదట పిలిచిన సర్వము
గనుదట సందేహమయ్యె గరుణావార్దీ!


భావం:-
ఓదయాసముద్రా!నీవుజీవులమాటలువిని,భక్తితోనిన్నుశరణువేడితే వెళ్లకూడనిచోట్లకి కూడాసర్వమూ మరిచివెళ్ళి రక్షిస్తావట.నేనుఇంతవేడుకుంటున్నానువ్వు రావడంలేదు.అందుకేసందేహంగావుంది.గజేంద్రుడు

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 2

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 2

చెడు గరులు హరులు ధనములు
చెడుదురు నిజసతులు సుతులు
చెడుచెనటులకున్ జెడక మనునట్టి సుగుణులకు
జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్


భావం:-
చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు.

Saturday, August 31, 2019

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 1

పోతన పద్యాలు (Pothana Padyaalu) - 1

చెడు గరులు హరులు ధనములు
చెడుదురు నిజసతులు సుతులు
చెడుచెనటులకున్
జెడక మనునట్టి సుగుణులకు
జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్


భావం:-
చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు.