Sunday, September 29, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 426

వేమన శతకం (Vemana Shatakam) - 426

చేయదగినవేళ జేసిన కార్యంబు
వేగపడి యొనర్ప విషమగు
బుడమకాయ చేదు; ముదిసిన తీపగు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనమెప్పుడు తగిన సమయంలో తగిన పనినే చేయాలి. సమయమికి కొంచెం అటు ఇటు అయినా ఆపని పనికిరాకుండా ఉండే ప్రమాదం ఉంది. బుడమకాయ పచ్చిగా ఉన్నఫ్ఫుడు చేదుగా ఉంటుంది. బాగా పండితే కుళ్ళు వాసన వస్తుంది. దోరగా ఉన్నప్పుడే బాగుంటుంది.

No comments:

Post a Comment