Tuesday, September 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 324

వేమన శతకం (Vemana Shatakam) - 324

వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానఁబడ దదెంత ఘనునికైన
గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం:
వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం. 

No comments:

Post a Comment