Saturday, September 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 133

వేమన శతకం (Vemana Shatakam) - 133

సాధు సజ్జనులను సంతరించినవాడు
ప్రజల సంతసంబు పరచువాడు
కదసి శాత్రవులను గరుణ జూచినవాడు
పాదుకొన్న ముక్తి పరుడు వేమా


భావం:-
కష్టములందున్న సజ్జనుల కాపాడువాడు, ప్రజలను సంతోషపెట్టువాడు, తనను చంపవచ్చిన విరోధి నైన కరుణించువాడు తప్పక ముక్తిని పొందగలడు. వేమన శతక పద్యం.

No comments:

Post a Comment