Saturday, September 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 132

వేమన శతకం (Vemana Shatakam) - 132

బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు
బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ
ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
శరీరంఎంతపోషించినా చూస్తూండగానే ముసలిదయిపోతోంది.ప్రాణంఎలా వచ్చిందోఅలాగేపోతోంది,ధనము మనదనిప్రేమిస్తే అనుకోనిఖర్చులొచ్చి కరిగి పోతోంది.ధర్మమేమిగిలిమనతో పుణ్యం గావస్తుంది.

No comments:

Post a Comment