Sunday, September 8, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 70

సుమతీ శతకం (Sumathi Shathakam) - 70

ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ


భావం:-
చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము.

No comments:

Post a Comment