Sunday, September 8, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 69

సుమతీ శతకం (Sumathi Shathakam) - 69

వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనులకడ కేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ


భావం:-
వరదలొచ్చే పొలంలో వ్యవసాయం చెయ్యకు. అది సాగవదు.కరువుతో కష్టపడుతున్నా సరే చుట్టాలిళ్ళకు వెళ్ళకు.లోకువవుతావు.ఇతరులకు ఇంటిగుట్లు చెప్పకు.చేటు.పిరికివాడికి సేనాధిపత్యము నీయకు.

No comments:

Post a Comment