Sunday, September 8, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 67

సుమతీ శతకం (Sumathi Shathakam) - 67

ఇచ్చునదే విద్య రణమున
జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ


భావం:-
ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ.

No comments:

Post a Comment