Tuesday, September 10, 2019

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 43

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 43

నీపైఁ గాప్యము చెప్పుచున్న యతఁడున్నీపద్యముల్ వ్రాసియి
మ్మా పాఠంమొనరింతునన్న యతఁడున్ మంజుప్రబంధంబు ని
ష్టాపూర్తిం బఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్ గాక చీ
చీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం
శ్రీ కాళహస్తీశ్వరా! కవిగా నా భావములు చెప్పుచున్నాను. మా ఉత్తమ బంధువులెవరన్న నిన్నుద్దేశించి కావ్యము రచించుమని కోరిన కవిపోషకుడు, నీ పై కవితను చెప్పు కవియు, నిన్ను వర్ణించు పద్యములను చదువుకొనుటకు వ్రాసిమ్మని కోరినవారు, నిన్ను స్తుతించుచు వ్రాసిన మనోహరమగు ప్రబంధములను ఇచ్ఛాపూర్వకముగ అత్యంతాశక్తితో చదువుచుండువాదును. అంతియె కాని ఛీ ఛీ రక్తసంబంధమును ఆ బాంధవముతో తమ ప్రయోజనములకై వీరి వెంట పడుచుండు బంధువులను వాస్తవ బంధువులగుదురా. కానే కారు.

No comments:

Post a Comment