Saturday, September 7, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 61

కృష్ణ శతకం (Krishna Shathakam) - 61

హరినీవే దిక్కునాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు పొగడగ
గరిగాచిన రీతి నన్ను గావుము కృష్ణా


భావం:-
శ్రీకృష్ణా!నీవేదిక్కని నమ్ముకున్నాను. ఆనాడు లక్ష్మీదేవితో ఉన్నపళాన వెళ్ళి మకరిని శిక్షించి కరిరాజుని కాపాడి బ్రహ్మాది దేవతలచే పొగడబడిన రీతిగా నన్ను కాపాడు.కృష్ణశతకం.

No comments:

Post a Comment