Saturday, August 31, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 96

వేమన శతకం (Vemana Shatakam) - 96

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు
పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు

No comments:

Post a Comment