వేమన శతకం (Vemana Shatakam) - 94
పెట్టిపోయలేని వట్టి నరులు భూమి
పుట్టిరేమి? వారు గిట్టిరేమి?
పుట్టలోన జెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
ఇతరులకు కొంచమైన యీయజాలని యవివేకి పిసినారి పుట్టిన చచ్చిన ఒకటే. పుట్టలలో ఎన్నో చెదలు పుడుతూ చస్తూ ఉంటాయి. అలాగే వీరు పుట్టినా చచ్చినా ఎవరూ లెక్కచెయ్యరు.

No comments:
Post a Comment