వేమన శతకం (Vemana Shatakam) - 76
వాక్కు శుద్ధి లేనివాడు చండాలుడు
ప్రేమ శుద్ధి లేక పెట్టు టెట్లు?
నొసలు భక్తుడైన నోరు తోడేలయా!
విశ్వదాభిరామ వినురవేమ
భావం :-
చండాలుడంటే ఎవరు? పుట్టుకతోనే అస్పృశ్యుడనే ముద్ర వేసి దూరంగా పెట్టబడినవాడు కాదు. చండాలుడంటే మాటలో స్వచ్ఛత లేనివాడు. స్నేహంలో పవిత్రత లేనివాడు. ఈ రెండూ లేక ఎంత దానం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఇట్లాంటి వాడి నొసట భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు గాని నోటికి మాత్రం క్రూరమృగాల లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన. దేనికైనా త్రికరణ శుద్ధి ముఖ్యం అని సారాంశం.
వాక్కు అంటే పలుకు, మాట. తేజోమయంగా ఉంటేనే అది నిజమైన వాక్కు. అది మనస్సులోంచి రావాలి. వచ్చిన తర్వాత అది ఆచరణగా మారాలి. ‘కీర పోతంబులు పలువాకు మాటలకు బొక్కుచు నంచల బట్ట దారుచున్’ అని ప్రయోగం. శుద్ధి అంటే నిర్మలత్వం, పరిశుభ్రత, ఇలా ఎన్నో అర్థాలు. ‘ఆత్మశుద్ధి లేని ఆచార మేలరా’ అన్నాడు వేమన్న మరోచోట. అలాగే భావశుద్ధి. అంటే తలపోతల్లో మైల ఉండకూడదు. వైదిక కర్మలు చెయ్యడానికి యోగ్యతను సంపాదించడానికి చేసే సంస్కారాన్ని కూడా శుద్ధి అంటారు. హస్త శుద్ధి అంటే చేతి కళల నైపుణ్యం.
ఇక దేహశుద్ధి సంగతి అందరికి తెలిసిందే. వాక్శుద్ధి లేనివాడికి దేహశుద్ధే మంచి బహుమతి.
చండాలుడు అనే మాటకు క్రూర కర్ముడు అని అర్థం. కాని ఒక వర్గానికి దీనిని ఆపాదించడం వలన అది ఒక ఘోరమైన సాంఘిక అన్యాయానికి గురవటం వేల యేండ్ల చరిత్ర. వేమన్న పుట్టుకతో చండాలుడనటం తప్పు అబద్ధీకుడినే చండాలుడనాలంటున్నాడు. జన్మ చండాలునికి కాలంతరంలో మోక్షమన్నా ఉంటుందేమో కాని కర్మ చండాలునికి మాత్రం ఎప్పటికీ మోక్షం లభించదు అని లోకంలో వాడుక.
ఇక ప్రేమ. ఈ మాటకు ఈ రోజుల్లో ఎక్కువగా స్త్రీ పురుషుల మధ్య వలపుగా అనురాగంగా వాడుతున్నారు గాని ఇది చాలా పెద్దది. వాత్సల్యం, దయ లాంటివి కూడా దీనిలోకి వస్తాయి.
‘నొసలు భక్తుడైన’ అంటే నుదుటిపైన నామాలు ధరిస్తేనో, బూడిద పూసుకుంటేనో, తిలకం పెట్టుకుంటేనో అంత మాత్రాన్నే భక్తుడవుతాడా? అది బాహ్య వేషం. లోపల కూడా ప్రేమ, దయ ఉన్నప్పుడే అది నిజమైన భక్తి. తోడేలు నక్క లాంటి జంతువు. అడవికుక్క అని కూడా అంటారు. క్రూరమైందే. సంస్కృతంలో వృకము, ఈహా మృగము అంటారు.

No comments:
Post a Comment