భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 8
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
భావం:-
ప్రయత్నం చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు.

No comments:
Post a Comment